తిరుపతి: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న ఆయన ఇంటితో పాటు తిరుమలలోని లోకనాథం కార్యాలయంలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో దేవాలయ డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహిస్తున్న లోకనాథం గతంలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. లోకనాథంపై అందిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలు జరుగుతున్న సమయంలో లోకనాథం ఇంట్లోనే ఉన్నారు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)