శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

264 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌కు కొత్త భవనాలు

1 గంట క్రితం

health
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 6న గుడివాడ డివిజన్‌ జనార్దనపురంలో ప్రారంభోత్సవం

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 264 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ (ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు)కు రూ.103.16 కోట్లతో నిర్మించిన కొత్త భవనాలు సిద్ధమయ్యాయి. ఈ భవనాలను 6న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌ నందివాడ మండలం జనార్దనపురం నుంచి రాష్ట్రస్థాయిలో ప్రారంభించనున్నారు. ఇతర జిల్లాల్లోని భవనాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 4,472 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణానికి రూ.1,128.02 కోట్లు కేటాయించగా, డిసెంబరు 2026 నాటికి మరో 2,750 భవనాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు, 71 రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్