తెలంగాణ : చార్మినార్ డివిజన్ ఎసిపి భార్య ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పోలీసుల వివరాల మేరకు .... ఎసిపి చంద్రశేఖర్ భార్య హేమలత (50) తో కలిసి అల్వాల్‌లోని సాయిబాబానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి చంద్రహాస్, గీతాంజలి సంతానం. వారిద్దరికీ వివాహాలయ్యాయి. కుమారుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. హేమలత వారి భవనంలోనే నగల, దుస్తుల వ్యాపారం చేసేవారు. ఆదివారం మధ్యాహ్నం అల్వాల్ పిఎస్ పరిధి బృందావన కాలనీలోని తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త చంద్రశేఖర్ ఆమెకు ఫోన్ చేయగా స్పందించకపోవడంతో కుమారుడికి సమాచారం ఇచ్చాడు. కుమారుడు వచ్చి చూడగా అప్పటికే తల్లి గడియపెట్టుకొని ఉరివేసుకున్నట్లు గమనించాడు. వాచ్‌మెన్ సాయంతో తలుపు పగలకొట్టి.. వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మేరకు చంద్రహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ తల్లి కడుపు, వెన్నెముక సంబంధమైన అనారోగ్య సమస్యలు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఎసిపి భార్య ఆత్మహత్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 11:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)