సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బోర్ల దొంగతనాలు.. రైతులు అవస్థలు

1 గంట క్రితం

theft
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 10:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రైతుల ఫిర్యాదులు ప్రశ్నార్ధకం

- అన్నదాతల అవస్థలు వర్ణనాతీతం

- వారం వ్యవధిలో మరో దొంగతనం

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలో దొంగతనాలు పెరుగుతున్నాయి. పట్టించుకునే నాధుడే లేదు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న పరిష్కారం లేదు. వారి అవస్థలు వర్ణనాతీతం. రైతు పొలాల్లో విద్యుత్ వైర్లను దొంగతనం చేసే వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇందుకు సంబంధించి రైతులు సోమవారం మీడియాకు చెప్పిన వివరాలు... చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో పచ్చికాపల్లం పంచాయితీ పెద్ద పోటు చేను గ్రామంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు స్టార్టర్లు, బోరు మోటారుకు అనుసంధానమైన కాపర్ వైర్లను కత్తిరించుకుని వెళ్ళినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో ఆ గ్రామానికి చెందిన త్రాగునీటి బోరు మోటర్ వైరు కూడా ఉంది. పదిమంది రైతుల కాపర్ వైర్లను కర్తరించుకునే తీసుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గత వారంలో తిరుమలయ్య పల్లి పంచాయతీ, గుర్రం వారి కండ్రిగ గ్రామంలో ఇదే తరహాలో దొంగతనాలు జరిగినట్లు ఆ గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి చెప్పారు. వరుస దొంగతనాలతో మండలంలో రైతులకు కంటిమీద కునుకు లేకుండా రాత్రి సమయంలో తమ వ్యవసాయ పంట పొలాల దగ్గర కాపలాకాస్తున్నట్లు చెబుతున్నారు. అన్నదాతకు ఏ న్యాయం జరుగుతుందో లేచి చూడాలని స్థానికుల అభిప్రాయం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్