సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ మంత్రి ఓటు మిస్సింగ్

1 గంట క్రితం

Former minister's vote missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన శెనకాల అరుణ ఓటు మిస్ అయిందని గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె బిజెపి పార్టీలో ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా గుంటూరులో నివసిస్తున్నానని మంత్రిగా పనిచేశానని ప్రస్తుతం జరుగుతున్న సర్ కార్యక్రమంలో తన ఓటు లేదని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. మీకు తర్వాత నోటీసు ఇస్తామని నోటి మాటగా చెబుతున్నారు తప్ప ఎలాంటి రాతపూర్వక రసీదు ఇవ్వలేదన్నారు. తన మోదుకు రేపే చివరి తేదీ అని, తన ఓటును కాపాడుకోవడానికి ఫిర్యాదు చేశానని, ఓటు హక్కును పునరుద్ధరించే వరకు పోరాడతానని ఆమె అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్