మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దళితుల అంత్యక్రియలు అడుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

10 జులై, 2026

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్సి కమిషన్ చైర్మన్‌‌కు కెవిపిఎస్ లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తిరుపతిలోని తిమ్మినాయుడు పాళెంలో దళితులకు శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకుని, కులవివక్షకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కెవిపిఎస్‌ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సి కమిషన్ చైర్మన్‌ కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్‌కు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం లేఖ రాశారు. తిమ్మినాయుడు పాళెం 50వ వార్డు మాజీ కార్పొరేటర్ అనిల్ తండ్రి మరణించగా, తరతరాలుగా దళితులు ఉపయోగిస్తున్న శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించకుండా కొందరు అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు సహకరించాలని ఒక దళిత యువకుడు పోలీసుల పాదాలను తాకి వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం రాజ్యాంగ స్ఫూర్తికి, మానవ హక్కులకు తీవ్ర విరుద్ధమని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్