మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళల్లో ఎముకలు దృఢంగా ఉండాలంటే...

47 నిమిషాల క్రితం

wosdmen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 05:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత ఎముకల బలం క్రమంగా తగ్గుతుంది. దీంతో చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన నొప్పులు కూడా వస్తాయి. ఎముకలు దృఢంగా ఉండాలంటే సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

హార్మోన్ల ప్రభావం : ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గడం, కాల్షియం, విటమిన్‌–డి లోపం వల్ల మెనోపాజ్‌ తర్వాత ఎముకల బలం తగ్గుతుంది. ఈ దశలో న్యూట్రిషనిస్టుల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడంతో పాటు శరీరానికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

మందుల ప్రభావం : కొన్ని వ్యాధులకు దీర్ఘకాలం వాడే మందులు కూడా ఎముకల బలాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ చికిత్సకు, చిన్నపేగు సంబంధిత సమస్యలకు వాడే కొన్ని మందులు ఎముకలను బలహీనపరుస్తాయి. అలాంటి మందులు వాడుతున్నవారు బోన్‌ డెన్సిటీ పరీక్ష అవసరమా అనే విషయాన్ని వైద్యులను అడిగి తెలుసుకోవాలి.

లక్షణాలను గుర్తించాలి : ఎముకలు బలహీనపడుతున్నాయని ప్రారంభ దశలో ప్రత్యేక లక్షణాలు కనిపించవు. చిన్న పనులు చేస్తుండగానే వెన్నునొప్పి, ఎముకల నొప్పి వంటి సమస్యలు వస్తే సాధారణ బ్యాక్‌పెయిన్‌గా నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఆహారంలో మార్పులు : ఎముకల బలానికి మహిళలు తప్పనిసరిగా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పాలు, పెరుగు, పనీర్‌, చీజ్‌, రాగి, నువ్వులు, ఆకుకూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వాటికి బదులుగా కాల్షియం అధికంగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవాలి.

వ్యాయామం : నొప్పులు ఉన్నాయని వ్యాయామానికి దూరంగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ వాకింగ్‌, డ్యాన్స్‌, మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామాలు చేస్తే కండరాలు, ఎముకలు బలపడతాయి. ఏ వ్యాయామమైనా మొదట కొద్దిసేపు ప్రారంభించి, తర్వాత క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ చేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్