మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరిటైర్డు ఉద్యోగులకు వయసు ఆధారిత అదనపు పెన్షన్ పెంపు

49 నిమిషాల క్రితం

Retired-employees_V_jpg--442x260-4g.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ

  • 2027 జనవరి నుంచి అమలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రిటైర్డు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పెన్షన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయసు ఆధారిత అదనపు పెన్షన్‌ను పాత రేట్లకు తిరిగి పెంచి పునరుద్ధరించింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.​ 70 ఏళ్లు పూర్తయిన వారికి ప్రస్తుతం 7 శాతం చొప్పున అందజేస్తున్న అదనపు పెన్షన్‌ను 10 శాతానికి, అలాగే 75 ఏళ్లు పూర్తయిన వారికి ప్రస్తుతం 12 శాతం అదనపు పెన్షన్‌ వస్తుండగా దానిని 15 శాతానికి పునరుద్ధరించింది. అయితే 80 ఏళ్ల దాటినవారికి ప్రస్తుతమున్న పెన్షనే కొనసాగుతుంది. 2019లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 70 ఏళ్లు పూర్తయిన పెన్షనర్లకు ప్రాథమిక పెన్షన్‌పై 10 శాతం, 75 ఏళ్లు పూర్తయిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ ఉండేది. అయితే 11వ వేతన సవరణ సంఘం అనంతరం 2022లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ రేట్లను తగ్గించారు. ఇప్పుడు మళ్లీ అదనపు పెన్షన్‌ పెంచి గతంలో ఉన్న శాతాలకు పునరుద్ధరించారు.

అయితే అదనపు పెన్షన్‌ 2027 జనవరి నుంచి అమల్జేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే ఈ పెంపు జనవరిలో చెల్లించే డిసెంబరు నెల పెన్షన్‌కు వర్తిస్తుంది. ​ఈ మేరకు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్