న్యూఢిల్లీ : 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్లు కేసులో నిందితుడు షర్జీల్ ఇమామ్‌కు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరైంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. షర్జీల్ ఇమామ్ తన సమీప బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు వీలుగా కర్కర్‌డూమా కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్‌పాయ్ ఈ బెయిల్ మంజారు చేశారు. ఈ నెల 30న షర్జీల్ ఇమామ్ సాధారణ బెయిల్ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ నిర్వహించనుంది. దీనికి ముందు అతనికి మధ్యంతర బెయిల్ మంజారుకావడం విశేషం. 2019-2020లో ఢిల్లీలో జరిగిన సిఎఎ వ్యతిరేక ఆందోళనల్లో ఇమామ్, ఇతర విద్యార్థి కార్యకర్తలు పాల్గొన్నారు. 2020 ఫిబ్రవరిలో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి వీరిని అరెస్టు చేశారు. యుఎపిఎ కింద అదే ఏడాది ఆగస్టులో ఇమామ్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇమామ్ నేరం నిర్ధారణ కాకపోయినా జైలులో మగ్గిపోతున్నారు.
Print Edition2020 ఢిల్లీ అల్లర్లు కేసులో.. షర్జీల్ ఇమామ్‌కు ఏడు రోజుల బెయిల్
51 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)