న్యూయార్క్ లో భారీ ప్రదర్శన
ప్రారంభమైన ఐరాస సర్వసభ్య సమావేశాలు
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ప్రపంచ నాయకులు సమావేశమవుతున్న తరుణంలో మంగళవారం న్యూయార్క్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇరాన్ జాతీయ ప్రతిఘటన మండలి మద్దతుదారులు ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ఐక్యరాజ్యసమితి సమీపంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఇరాన్‌లో జరుగుతున్న హత్యలు, రాజకీయ అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్, నెతన్యాహులు చేస్తున్న మారణహోమాన్ని ఆపేలా ఐరైస జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సమావేశం జరిగే ప్రాంతంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిరసనకారులు ప్రదర్శనగా వస్తుండగా భద్రతాబలగాలు అడ్డుకున్నాయి.








కామెంట్‌లు (0)