మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజోగి రమేష్‌ కోడలు ఫిర్యాదుపై నిష్పక్షపాత దర్యాప్తు : ఐద్వా డిమాండ్‌

49 నిమిషాల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 11:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ మంత్రి జోగి రమేష్‌ కోడలు ఫిర్యాదుపై సమగ్ర, పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి డిమాండ్‌ ‌చేశారు. రాజకీయ హోదా, ఆర్థిక బలం, సామాజిక పలుకుబడి కారణంగా దర్యాప్తు ఏ విధంగా ప్రభావితం కాకుండా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో వారు కోరారు. రాష్ట్రంలో మహిళలపై గృహ హింస, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళల భద్రత, గౌరవం, న్యాయ రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిజా నిజాలను త్వరితగతిన వెలికితీసి, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్