- కెవిపిఎస్ పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలి కెవిపిఎస్ రాష్ట్ర కమిటి పిలుపునిచ్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విబి గ్రామ్ జీ గ్రామీణ పేదల ఉపాధి హక్కును నిర్వీర్యం చేస్తోందని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై వేల కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారాన్ని మోపే ప్రజా వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, రాష్ట్రాలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఉపాధి హామీ పథకానికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అన్ని ప్రజాస్వామ్య, కార్మిక, రైతు, దళిత, మహిళా, యువజన సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)