పంటల వారీగా ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు సాయం
ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించింది. వివిధ పంటలకు జరిగిన నష్టాన్ని బట్టి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు పరిహారం అందించనున్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. పంటల వారీగా పరిహారం వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున, వరి పంటకు రూ.20 వేల పరిహారం అందించనున్నారు. చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేల సాయం ప్రకటించారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు ఎకరాకు రూ.35 వేల పరిహారం ప్రకటించారు. కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్ పంటలకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించనున్నారు. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లకు ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపింది.







కామెంట్లు (0)