మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2027 వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సోఫీ మొలినెక్స్ భారీ ధర పలికింది. యూపీ వారియర్స్ ఆమెను రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా మొలినెక్స్ కోసం పోటీపడినప్పటికీ, చివరకు యూపీ వారియర్స్ ఆమెను దక్కించుకుంది. ఆ జట్టు హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ మొలినెక్స్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపారు. దీంతో కొచ్చిలో బుధవారం జరిగిన వేలంలో తొలి రౌండ్‌లో అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
తొలి రౌండ్‌లో అమ్ముడైన క్రీడాకారిణులు
కిరణ్ నవ్‌గిరే – ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 75 లక్షలు
సోఫీ మొలినెక్స్ – యూపీ వారియర్స్ – రూ. 1.1 కోట్లు
జి. కమలిని – గుజరాత్ జెయింట్స్ – రూ. 40 లక్షలు
ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ – గుజరాత్ జెయింట్స్ – రూ. 30 లక్షలు
స్నేహ్ రాణా – యూపీ వారియర్స్ – రూ. 30 లక్షలు
గ్రేస్ హ్యారిస్ – యూపీ వారియర్స్ – రూ. 30 లక్షలు
రెండో రౌండ్‌లో అమ్ముడైన క్రీడాకారిణులు
సుష్మా వర్మ – యూపీ వారియర్స్ – రూ. 30 లక్షలు
దిశా కసత్ – ముంబై ఇండియన్స్ – రూ. 10 లక్షలు
మూడో రౌండ్‌లో అమ్ముడైన క్రీడాకారిణులు
లతిక ఇనాందార్ – ముంబై ఇండియన్స్ – రూ. 10 లక్షలు
భారతి రావల్ – ముంబై ఇండియన్స్ – రూ. 10 లక్షలు








కామెంట్‌లు (0)