నేడే అప్పీల్ దాఖలు చేస్తాం
ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజాశక్తి - రేపల్లె, బాపట్ల జిల్లా : బిసి రిజర్వేషన్ల జిఓలు కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపల్లెలో ఎన్‌టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గురువారం పాల్గొన్న ఆయన ఈ విషయం ప్రస్తావించారు. హైకోర్టు తీర్పుపై నేడే (శుక్రవారం) అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. బిసి రిజర్వేషన్లను ప్రతిపక్షం అడ్డుకుందని ఆయన ఆరోపించారు. కోర్టులో పిటిషన్లు వేస్తూ అడ్డుకున్నారని చెప్పారు.బిసిలకు రాజకీయంగా ఎన్‌టిఆర్ గుర్తింపు తెచ్చారని , తాను 1995లో స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. వైసిపి అధికారం లోకి వచ్చాక దానిని 24 శాతానికి తగ్గించింద న్నారు. దీంతో 16,800 మంది పదవులు పోయాయన్నారు. ఇప్పుడు మళ్లీ తాము 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తుంటే అడ్డుకున్నారని చెప్పారు. 50 శాతం కంటే రిజర్వేషన్లు పెరగ కూడదని కోర్టులో వాదించారన అన్నారు.,బిసిలకు రాజకీయంగా అండగా నిలబడే బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపారు.






కామెంట్‌లు (0)