గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగ్రూప్-1 ప్రిలిమ్స్‌‌కు ఉచిత శిక్షణ..

-246 నిమిషాల క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 04:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిపిఎస్సి నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్‌(2026) పరీక్షకు అర్హత కలిగిన ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ వెల్లడిచింది. విజయవాడలోని బి.ఆర్‌. అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ శిక్షణను ఇవ్వనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కోచింగ్‌ కాలవ్యవధి 3 నెలలు కాగా, మొత్తం 150 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అభ్యర్థుల ఎంపిక గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అర్హత ప్రమాణాల ఆధారంగా జరుగుతుందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఇతర సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఈ నెల 6 నుంచి 10 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తులు సమర్పించాలని, 12 నుంచి హాల్‌ ‌టికెట్ల మంజూరు, 15న స్ర్కీనింగ్‌ ‌టెస్ట్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. శిక్షణ తరగతులు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించింది. బోధన, వసతి, స్టడీ మెటీరియల్‌, వారాంతపు పరీక్షలు, మెంటరింగ్‌ తదితర సదుపాయాలు అందించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు apstudycircle.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలకు 9493343866 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్