గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబట్టబయలైన రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపం

56 నిమిషాల క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 12:50 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి

  • సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన రెండు జివోలను హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వ మోసకారితనాన్ని బట్టబయలు చేసిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో . నిజాయితీ ఉంటే ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసి కూడా ఎన్నికల లబ్ధి కోసం బిసిలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు సిద్ధమని కూటమి ప్రభుత్వం హడావుడి చేసిందని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఇంకా పరిశీలనలో ఉందని హైకోర్టులో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరో వైపు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పడం బిసిలను మోసం చేయడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైన బిల్లులన్నింటికీ మద్ధతిస్తున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆటంకంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి పార్లమెంట్‌లో చట్ట సవరణకు ఎందుకు ఒత్తిడి తేవడంలేదో రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలని కోరారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత, స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దివారాల ముందు 34 శాతం రిజర్వేషన్ల అంశం ముందుకు తీసుకరావడం బిసిలను దగా చేయడానికి కూటమి ప్రభుత్వం ఆడిన నాటకంగా హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వ మోసకారి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్