ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి యునాని మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇచ్చిన గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంఘం 2014 - 15 నుంచి పదేళ్లపాటు నిబంధనల ప్రకారం సభ్యుల వివరాలు, కార్యవర్గ జాబితా, రాజ్యాంగం, ఆడిట్ చేసిన వార్షిక ఖాతాల వివరాలను సమర్పించలేదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే సంఘంలో ప్రస్తుతం 49 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని, ఇది నిర్దేశిత కనీస సభ్యత్వం కంటే తక్కువని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనపై సంఘానికి నోటీసులు జారీ చేసి, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించిన అనంతరం గుర్తింపును తక్షణమే ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై సంఘానికి గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘానికి లభించే హోదా, హక్కులు, ప్రత్యేక సౌకర్యాలు వర్తించవని పేర్కొంది.
ఎపి యునాని వైద్యాధికారుల సంఘం గుర్తింపు రద్దు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 11:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)