గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎపిడిఇఇసెట్‌ ఫలితాలు విడుదల.. 80.20 శాతం అర్హత

16 గంటల క్రితం

ap deecet result
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎపి డిఇఇసెట్‌)-2026 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎగ్జామ్‌ స్టేట్‌ ‌కన్వీనర్‌, పాఠశాల విద్య గుంటూరు రీజనల్‌ ‌జాయింట్‌ ‌డైరెక్టర్‌ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 14,093 మంది అభ్యర్థులు హాజరు కాగా, 11,303 మంది (80.20 శాతం) అర్హత సాధించారు. తదుపరి కౌన్సెలింగ్ ప్రక్రియ, ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తదితర వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ (https://apdeecet.apcfss.in/) ద్వారా వెల్లడిస్తామని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్