- నోటిఫికేషన్ విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ 7వ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 9 గంటలకు వెలగపూడి అమరావతిలోని అసెంబ్లీ హాల్‌లో శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల సచివాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రత్యేక సంచికగా ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ముద్రణాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. శాసనసభ సభ్యులందరికీ, ప్రభుత్వ శాఖలకు, కేంద్ర ప్రభుత్వ సంబంధిత శాఖలకు, ఎన్నికల సంఘానికి, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటిఫికేషన్ ప్రతులను పంపించారు. ఈ నెల 17న ప్రారంభం కానున్న అసెంబ్లీ ఏడో సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉంది. కొన్ని బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.








కామెంట్‌లు (0)