నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత...
ప్రజాశక్తి-కడప: స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవ్వడంతో ఎపిలోని పలు ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కడపలోని మరియాపురం నామినేషన్ కేంద్రం సమీపంలో కత్తుల దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కత్తులతో జరిగిన దాడిలో వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ తనయుడు మురాద్ బాషాతో పాటు మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. ఈ దాడికి గల కారణాలు, ఘటనలో పాల్గొన్నవారి వివరాలు, క్షతగాత్రుల పరిస్థితిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ జిల్లాలోని గాంధీనగర్లో సైతం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. రాళ్లదాడిలో పలువురు గాయపడ్డారు.






కామెంట్లు (0)