శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దసరా శోకం...

58 నిమిషాల క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 02:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎండిన నేలల సాక్షిగా చీకట్లు

ఎల్ నినో వేడికి మాడిపోయిన పొలాలు.

పచ్చని భూమిలో మంటలు

పండగ ముంగిట కరువు ఛాయలు..

​

కడుపుల నిండా కరువు

కన్నీటి వేదనల అరువులలో

బతుకు బండికి దొరకని ఇంధనం

రైతన్న ఇంటిలో దరిద్ర దేవత దర్శనం.

​

ఉచిత బియ్యం పాత్రలో ఉడికించేందుకు

నూనె చుక్క వెలగలని స్వప్నం.

అటకెక్కిన సరుకులపై

కూరగాయల ధరల రాకెట్ పరుగు.

​

పరిమళాల పిండివంటలు మరిచి

పొయ్యిలన్నీ కన్నీళ్ల కాష్టం.

పెరిగే నిత్యావసరాల హోరులో

తరగిపోయే అరచేతి బతుకులు.

​

అబద్ధపు వాగ్దానాల నీడన

అప్పుల వలలో ఆశల నావలు.

ధనవంతుడి ఇంట వెలుగుల హంగామా,

పేదవాడి పూరి గుడిసెలో అంధకారాల శూన్యం.

​

తడవని పొలాలతో

ఎడారి సీమల్లో చీకటి నీడల్లో

పండుగ మొయ్యలేని భారమై

కళ తప్పిన ముఖాల్లో విషాదపు కన్నీళ్లు మిగిలే.


- కొప్పుల ప్రసాద్,

సెల్‌: 9885066235

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్