19 మంది పరిస్థితి విషమం..
ఆటోలో 23 మంది ఉన్నట్లు గుర్తింపు
ప్రజాశక్తి-హైదరాబాద్: హైదరాబాద్ హిమాయత్‌సాగర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో టిప్పర్‌ను ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ఉన్నట్లు గుర్తించారు. కొత్తూరు సమీపంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పనిచేసిన అనంతరం వారంతా తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







కామెంట్‌లు (0)