మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

క్రీడలతో ఒత్తిడికి దూరం

11 జులై, 2026

dgp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఎస్‌‌జి వార్షిక క్రీడోత్సవంలో అదనపు డిజిపి మహేష్‌ చంద్ర లడ్డా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అదనపు డిజిపి మహేష్‌ చంద్ర లడ్డా అన్నారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలోని సిబ్బంది మధ్య స్నేహభావం, ఐక్యతను పెంపొందించేందుకు క్రీడా పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని చెప్పారు. ఎపిఎస్‌‌పి 6వ బెటాలియన్‌‌లోస్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జి) ఆధ్వర్యంలో వార్షిక క్రీడోత్సవం–2026 ఉత్సాహంగా శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లడ్డా ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఐజిపి పిహెచ్‌‌డి రామకృష్ణ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌జి డైరెక్టర్‌ జగదీశ్‌ అదహళ్లి, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య నేతృత్వంలో కార్యక్రమం జరిగింది.

​మొత్తం 25 క్రీడాల్లో పోటీలు నిర్వహించి 132 బహుమతులను అందించారు. క్రీడల్లో సిబ్బంది ప్రదర్శించిన ఉత్సాహాన్ని మహేష్‌ చంద్ర లడ్డా అభినందించారు. ఈ క్రీడోత్సవం తన ఉద్యోగ జీవిత తొలినాళ్లను గుర్తుచేసిందని పేర్కొన్నారు. విజేతలకు అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌డబ్ల్యూ ఎస్పి కె ఆరిఫ్‌ హఫీజ్‌, సిఐ సెల్‌ డిఐజి పి.ప్రకాశ్‌, ఎస్‌ఐబీ ఎస్పి వి గీతాదేవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్