సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలమూరులో యువకుడి దారుణ హత్య

1 గంట క్రితం

hatya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 10:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–ఆలమూరు: ప్రశాంతంగా ఉండే పెదపళ్ల గ్రామంలో యువకుడి హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదివారం రాత్రి గంటా దినేష్ కుమార్ (28) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై ఎస్ఐ జి.నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ పేటకు దినేష్ కుమార్ తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, అదే ప్రాంతానికి చెందిన కుడెల్లి సతీష్, చాపల నాని అడ్డగించి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్ కుమార్ ను గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆలమూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధాలే కారణమా, లేక పాత కక్షల నేపథ్యంలో జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి. నరేష్ తెలిపారు. కాగా హతుడు, నిందితులు ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్