ప్రజాశక్తి-కంచికచర్ల: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల వద్ద ఆదివారం ఉదయం ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఘోర ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. పేరకలపాడు అడ్డరోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 36 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు, స్థానికులు యోలో ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు 36 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి 10.50 గంటలకు విజయవాడకు బయలుదేరింది. ఆదివారం ఉదయం సుమారు 6.15 గంటల సమయంలో కీసర టోల్‌గేట్, పేరకలపాడు అడ్డరోడ్డు దాటి పెట్రోల్ బంకు వద్దకు చేరుకునే సమయంలో ముందు ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను బస్సు రాసుకుంటూ ఢీకొంది. బస్సు డీసీఎంను ఢీకొన్నప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
బస్సు–డీసీఎం ఢీ.. తప్పిన పెను ప్రమాదం
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)