గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చంద్రబాబుతో సునీల్ భారతి మిట్టల్‌ భేటీ

28 జూన్, 2026

cm cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్‌తో అమరావతిలో క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చివరి మైలు ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ కనెక్టివిటీ పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన కనెక్టివిటీ అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్