ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నవంబర్ 1, 2, 3 తేదీల్లో భీమవరంలో చెకుముకి సైన్సు సంబరాలు

1 గంట క్రితం

Chekumuki Science Celebrations in Bhimavaram on November
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్సు సంబరాలు నిర్వహిస్తున్నట్లు జెవివి రాష్ట్ర అధ్యక్షులు కెఎస్.లక్ష్మణరావు తెలిపారు. యుటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం జెవివి జిల్లా కమిటీ సమావేశం, అనంతరం రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహణ సన్నాహక సమావేశం జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక 36 ఏళ్లుగా రాష్ట్రంలో 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందని, ఈ ఏడాది రాష్ట్రస్థాయి సంబరాలు భీమవరంలో నిర్వహించనున్నామని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల అవగాహన, అభిరుచిని పెంపొందించడం, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడం సైన్స్ సంబరాల ముఖ్యోద్దేశమన్నారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సురేష్, చెకుముకి రాష్ట్ర కన్వీనర్ కెఎంఆర్.ప్రసాద్, జెవివి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జామాను రామ లక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చింతపల్లి ప్రసాదరావు, చెకుముకి జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్నబాబు, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్