ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition44 శాతం పెండింగ్‌!

1 గంట క్రితం

election
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 12:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పూర్తికాని ఎస్ఐఆర్‌ నోటీసుల విచారణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌) ప్రక్రియలో నోటీసుల విచారణ ఇంకా 44 శాతం పూర్తికాలేదు. విచారణ గడువు ఆదివారంతో ముగిసినప్పటికీ పొడిగింపునకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో నోటీసులు అందుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. 44.16 లక్షల నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటి వరకు 24.54 లక్షల మందిపై విచారణ పూర్తయింది. 19.62 లక్షల మందిపై విచారణ జరగాల్సి ఉంది. ఫారం-6కు సంబంధించి దరఖాస్తులు 8,58,455 రాగా, పెండింగ్ 2,96,063, ఫారమ్‌-7కు సంబంధించి దరఖాస్తులు 48,12,704, పెండింగ్ 7,118, ఫారమ్‌-8కు సంబంధించి 12,03,045 దరఖాస్తులు రాగా, 1,86,365 పెండింగ్‌‌లో ఉన్నాయి.​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్