ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: విజయవాడ పున్నమిఘాట్ మైదానంలో జరుగుతున్న నేషనల్ సరస్ మేళాను భారతదేశంలోని చైనా రాయబారి జు ఫెయిహాంగ్, తన ప్రతినిధులతో కలిసి సందర్శించారు. చైనా రాయబారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందంలో ఆయన సహచరిణి టాన్ యుక్సియూ, మినిస్టర్ కౌన్సెలర్ జౌ గువోహుయ్, సెక్రెటరీ గువో డోంగ్డాంగ్, రాయబారి కార్యదర్శి లీ అన్నన్ ఉన్నారు. ఈ సందర్భంగా రాయబారి, ఆయన సహచరిణి, ప్రతినిధి బృంద సభ్యులు.. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి, వారి ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలుసుకున్నారు. కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను వ్యాపారాలుగా మలుచుకుంటూ, ఉత్పత్తుల తయారీతో పాటు వాటి మార్కెటింగ్లో ముందంజ వేయడాన్ని చూసి చైనా రాయబారి అభినందించారు.
సరస్ మేళాను సందర్శించిన చైనా రాయబారి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)