ప్రజాశక్తి-అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడి సేవలు ఎంతో విలువైనవని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలతో పాటు మంచి విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనదని కొనియాడారు. దేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగి, దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించిన రాధాకృష్ణన్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ జీవితంలోని విలువలు, ఆదర్శాలను నేటి భావితరాలు స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 10:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)