శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

1 గంట క్రితం

teachers.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి

ప్రజాశక్తి-రాజంపేట(కడప) : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని శనివారం రాజంపేట పట్టణంలోని వైసిపి కార్యాలయం ఆకేపాటి భవన్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆకేపాటి ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఫౌండేషన్ చైర్మన్, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి సన్మానించారు. ఉపాధ్యాయులకు శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది గురువులేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు వెంకట రెడ్డి, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్