శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిఎంకె మాజీ మంత్రి నివాసంలో సోదాలు

1 గంట క్రితం

KN Nehru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తిరుచ్చిలోని డిఎంకె మాజీ మంత్రి కె.ఎన్‌.నెహ్రూ నివాసంలో విజిలెన్స్‌, అవినీతి నిరోధక శాఖ (డివిఎసి) అధికారులు శనివారం సోదాలు ప్రారంభించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని డివిఎసి బృందం, తిల్లై నగర్‌లోని కె.ఎన్‌.నెహ్రూ నివాసంలో ఉదయం 6.30గంటల నుండి సోదాలు చేపడుతున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నట్లు పేర్కొన్నాయి. అయితే, ఏ కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్నాయో తెలియాల్సి వుంది. ఈ సోదాలను నిరసిస్తూ మాజీ మంత్రి అన్బిల్‌మహేష్‌ సహా పలువురు డిఎంకె కార్యకర్తలు ఆయన నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్