ప్రజాశక్తి-యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వశిష్ట గోదావరి బ్రిడ్జిపై విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు పట్టణానికి చెందిన నంబూరి శ్రీనివాస్ (45), ఆయన భార్య పద్మిని (42), ఇద్దరు పిల్లలు గోదావరిలోకి దూకారు. రెండు బైకులపై బ్రిడ్జి వద్దకు వచ్చిన కుటుంబం ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబం నదిలో దూకడాన్ని గమనించిన జాలర్లు వెంటనే స్పందించి పద్మినిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆమెను పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్, ఇద్దరు పిల్లల ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
గోదావరిలో దూకిన కుటుంబం.. ముగ్గురు గల్లంతు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 11:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)