ఇద్దరికి తీవ్ర గాయాలు.. డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిన వైనం
ప్రజాశక్తి – వేటపాలెం : వేటపాలెం మండలం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో 216 జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి భారీ లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. రాత్రి ఒంటిగంట సమయంలో ముందు వెళ్తున్న లారీతో పాటు మరో వాహనాన్ని ఢీకొన్న అనంతరం లారీ రహదారి పక్కకు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ పద్మరాజుకు రెండు కాళ్లు విరిగాయి. లారీలో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. రాజమండ్రి నుంచి తిరుపతికి వంటనూనె లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వేటపాలెం పోలీసులు తెలిపారు. క్రేన్ సహాయంతో రహదారికి అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించారు.








కామెంట్‌లు (0)