బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేసిఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

1 గంట క్రితం

revanth reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం అసెంబ్లీలో మాట్లాడారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందో? లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. ‘‘సిద్దిపేటలో కేసీఆర్‌ కుటుంబానికి 67.5ఎకరాలు ఉంది. కేటీఆర్‌ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు, జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో 31 గ్రామాల్లో 439 ఎకరాలున్నాయి. కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌పై నేనెందుకు బాంబులు వేస్తా? నేనేమైనా బిన్‌లాడెన్‌నా. స్టీఫెన్‌సన్‌కు ఎన్నికల ముందు నజరానా ఇచ్చారు. రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్‌ చేశారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి 650 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారు. జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చింది. పైలట్‌ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారు. ఒక కుటుంబానికి కుష్కి పొలం 54, తరి పొలమైతే 27 ఎకరాలుండాలి. కానీ, కేసీఆర్‌కు ఉన్నది మొత్తం తరి పొలమే’’ అని సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ధరణి పార్ట్‌-2 అక్రమాలు బయట పెడతామని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్