బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి

1 గంట క్రితం

vra.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 05:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – ముద్దనూరు: రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండల అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం వీఆర్ఏలు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖలో సుమారు 20 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లుగా కేవలం రూ.10,500 జీతంతో వీఆర్ఏలు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినీలుగా పనిచేస్తున్న వారిని సెటిల్‌మెంట్ వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులైన వీఆర్ఏలకు 70 శాతం పదోన్నతులు కల్పించాలని కోరారు. మరణించిన వీఆర్ఏల కుటుంబాల్లో వయసుతో సంబంధం లేకుండా ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, శ్రీనివాసులు, ఆనంద్‌తో పాటు మహిళా వీఆర్ఏలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్