విజయవాడ: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటిసారి ఎపికి విచ్చేశారు. ఆయన మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. చెన్నై నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న సిఎం.. నేరుగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం సిఎం విజయ్ ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. సిఎం హోదాలో విజయ్ మొదటిసారి ఎపికి రావడంతో... అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సిఎం విజయ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 04:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)