మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మాడుగుల శ్రీనివాసరావు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 05:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పలువురు నాయకుల ఘన నివాళి

విజయవాడ: సీపీఎం నగర నాయకులు మాడుగుల శ్రీనివాసరావు గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పలువురు కమ్యూనిస్టు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, శ్రామిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం, కార్మికులు, కర్షకులు, పేద ప్రజల సంక్షేమం కోసం సాగిన పోరాటాల్లో కామ్రేడ్ మాడుగుల శ్రీనివాసరావు గారు అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని, ప్రజా ఉద్యమాలకు గొప్ప నష్టమని అన్నారు. కామ్రేడ్ శ్రీనివాసరావు గారి భౌతిక కాయం వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ సి.హెచ్. బాబురావు తొలుత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీపీఎం పశ్చిమ నియోజకవర్గ కార్యదర్శి మాజీ కార్పొరేటర్ కామ్రేడ్ బోయి.సత్తిబాబు, సిపిఎం పార్టీ మాజీ కార్పొరేటర్ జి. ఆదిలక్ష్మి, గాదే.సుబ్బారెడ్డి, ఎం.కొండారెడ్డి, సత్యారావు, దుర్గారావు, ఎంసీపీఐ(యు) నగర కార్యదర్శి కాసాని గణేష్ బాబు, అనకాపల్లి కనకరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా పోరాటాలే ఊపిరిగా, పీడిత ప్రజల విముక్తే లక్ష్యంగా సాగిన కామ్రేడ్ శ్రీనివాసరావు జీవితం, ఆయన పోరాట స్ఫూర్తి ప్రజా ఉద్యమాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.

విప్లవ జోహార్లు కామ్రేడ్ మాడుగుల శ్రీనివాసరావు!

లాల్ సలామ్!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్