ప్రజాశక్తి - నందలూరు: నందలూరు మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల (బాలికలు)కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని గురు స్నేహలత జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైంది. కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలలో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయి పోటీలకు స్నేహలత ఎంపికైనట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ కె.వి.ఎస్. రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి రగ్బీ పోటీలలో ఆమె పాల్గొననుంది. విద్యార్థిని స్నేహలతను ప్రిన్సిపాల్ అభినందిస్తూ, ఆమెకు శిక్షణనిచ్చి విజయానికి తోడ్పడిన వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీతను ప్రత్యేకంగా ప్రశంసించారు. విద్యార్థినులు క్రీడలతో పాటు విద్యలోనూ రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
జాతీయస్థాయి రగ్బీ పోటీలకు నందలూరు గురుకుల విద్యార్థిని ఎంపిక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)