బుధవారం, 12 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకార్మికుల వేతనాలపై సమగ్ర నివేదిక

1 గంట క్రితం

vasam setti
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 12, 2026, 10:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి వాసంశెట్టి సుభాష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కనీస వేతనల సలహా మండలి సభ్యులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, సంబంధిత రంగాల వారీ వేతనాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు రూపొందించాలని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ సూచించారు. యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో కార్మికశాఖకు సంబంధించిన కనీస వేతనాల సలహా మండలి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, వారి సంక్షేమం, కనీస వేతనాల అమలు, కార్మికులకు అందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ.. కొత్త లేబర్ కోడ్స్‌‌పై కార్మికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరంపై అధికారులకు సూచనలు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్