బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులను నిర్బంధించడంపై ఆందోళన

19 నిమిషాల క్రితం

ycp.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే కాటసాని ధర్నా

ప్రజాశక్తి – బనగానపల్లె : బనగానపల్లె మండలంలో వైసీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న పలువురిని పోలీసులు స్టేషన్లకు తరలించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధర్నా నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున అభ్యర్థులను పోలీసులు నిర్బంధించారని ఆరోపిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైసీపీ నియోజకవర్గ నాయకులు కాటసాని ప్రసాద్‌రెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌రెడ్డి తదితరులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా నియోజకవర్గవ్యాప్తంగా 85 మందిని వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించారని ఆరోపించారు. కూటమి నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సి ఉండగా, పోటీలో ఉన్న అభ్యర్థులను నిర్బంధించడం దారుణమన్నారు. నిర్బంధించిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ ధర్నాలో వైసీపీ ముస్లిం మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అత్తార్‌ జాహిద్‌ హుస్సేన్‌, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖైర్‌, జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు తోట బుచ్చిరెడ్డి, జిల్లెల్ల శంకర్‌రెడ్డి, కుమ్మరి సురేష్‌, తిమ్మాపురం సురేష్‌రెడ్డి, కైప మురళీమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్