బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పొడిగించాలి : సుప్రీంకోర్టు

15 నిమిషాల క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఈసీకి ఆదేశం

  • ఈ నెల 25 వరకు తుది జాబితా ప్రకటించొద్దని స్పష్టీకరణ

ఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు ఎదురైనట్లు ఫిర్యాదులు అందిన 19 మున్సిపాలిటీల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల గడువును పొడిగించాలని, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని ఎస్‌ఈసిని ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ వరకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించవద్దని స్పష్టం చేసింది.

నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని, గడువు పొడిగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని, నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్