బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

15 నిమిషాల క్రితం

15 kg of smuggled gold seized at the Bangladesh border.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం

  • ఐదుగురు నిందితుల అరెస్ట్‌

ప్రజాశక్తి – ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడను కేంద్రంగా చేసుకుని సాగుతున్న అంతర్జాతీయ బంగారం, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా ముఠా గుట్టును డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రట్టు చేశారు. విజయవాడ, హైదరాబాద్‌ విభాగాల అధికారులు సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, రూ.5.84 కోట్ల విలువైన 3.147 కిలోల విదేశీ బంగారంతోపాటు 60 వేల అమెరికన్‌ డాలర్లు, 21,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. కారులోని సీట్ల కింద రహస్య అరల్లో విదేశీ కరెన్సీని దాచిపెట్టి, ఆర్టీసీ బస్సుల్లో బంగారాన్ని తరలిస్తున్న అధికారులు తెలిపారు.

డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా బంగారాన్ని దేశంలోకి తీసుకొచ్చి, కోల్‌కతా మీదుగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు నిఘా బృందాలు గుర్తించాయి. ఈ సమాచారంతో విజయవాడ శివారులో జాతీయ రహదారిపై ఒక స్కార్పియో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయగా, సీట్ల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య అరల్లో దాచిన అమెరికన్‌ డాలర్లు, యూరోల కట్టలు బయటపడ్డాయి.

కారులో ఉన్న నిందితులను విచారించగా లభించిన సమాచారంతో అధికారులు హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు నుంచి 3.147 కిలోల విదేశీ బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వారు బంగారాన్ని నడుముకు క్లాత్‌ సంచులతో కట్టుకుని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ వ్యవహారంలో అరెస్టయిన ఐదుగురు నిందితులపై కస్టమ్స్‌ చట్టం–1962 కింద కేసులు నమోదు చేశారు. మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు వారిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్