ప్రజాశక్తి-విజయవాడ : కాకినాడ జిల్లాలో నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపిన సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేసి బైండోవర్ కేసులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం బైండోవర్ కేసులతో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం అన్యాయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాకినాడ సిటీ సిపిఎం నాయకుడు పలివెల వీరబాబు, విద్యార్థి నాయకులు ఎం. జి.సూరిబాబు, యువజన నాయకులు టి.రాజా, ఆదర్శలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం గర్హనీయమని విమర్శించారు. పోలీసు స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు గురిచేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఇటువంటి నిరంకుశ చర్యలను ప్రజలంతా ఖండించాలని పిలుపునిస్తూ, అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 07:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)