ప్రజాశక్తి-విశాఖ: ఆస్ట్రేలియాలోని మెల్బోర్ లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విశాఖ వాసులు మృతి చెందారు. మృతులు విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (వీడీసీఏ) మాజీ సంయుక్త కార్యదర్శి జీటీ ప్రసాద్ భార్య, కోడలు నేహాగా గుర్తించారు. ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జీటీ ప్రసాద్ కళ్లెదుటే జరగడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సంతోషంగా వేడుకకు వెళ్లిన కుటుంబంలో ఈ ఘోర ప్రమాదం తీరని శోకాన్ని నింపింది. మృతదేహాలను స్వస్థలమైన విశాఖపట్నం తరలించేందుకు ప్రక్రియ కొనసాగుతోందని, సుమారు 10 రోజుల్లో మృతదేహాలు విశాఖకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు.
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖ మహిళలు దుర్మరణం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 06:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)