గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition2026లో జీవిస్తున్నాం.. కానీ...

1 గంట క్రితం

FariaAbdullah.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బోనాల సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి ఫరియా అబ్దుల్లా తాజాగా మరోసారి స్పందించారు. ఆమె నటిస్తున్న ‘సిగ్మా’ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయంపై మాట్లాడారు. ‘ఇటీవల సోషల్‌ మీడియాలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అదే వేదికగా నేను కూడా ఆ వివాదంపై నా అభిప్రాయాన్ని తెలియజేశాను. అయితే, ఒక విషయం మాత్రం ఆ తరువాత కూడా నన్ను వెంటాడింది. మనం 2026లో జీవిస్తున్నాం. కానీ, ఇంకా చాలామంది పాతకాలం వాళ్లలా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో కొందరి భావజాలం బాధించింది. నేనెప్పుడూ అభ్యుదయ భావాలతో ఆలోచిస్తాను. నా పద్ధతులు నచ్చిన వాళ్లు అనుసరిస్తారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. అందరి ఆలోచనలను నేను గౌరవిస్తాను’ అని చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా అబ్దుల్లా పోతురాజుతో కలిసి నృత్యం చేశారు. ఆమె పండగలో పాల్గొనడంపై కొందరు మతం పేరుతో విమర్శలు చేయడంతో ఫరియా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్