గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రణబాలి షూటింగ్‌ పూర్తి..

1 గంట క్రితం

ranabaali-movie.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయ్‌ దేవరకొండ, రష్మిక నటిస్తున్న కొత్త చిత్రం ‘రణబాలి’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమా కోసం టీమ్‌ మొత్తం 130 రోజులు విశ్రాంతి లేకుండా కష్టపడిందని దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ పోస్ట్‌ చేశారు. మరో 29 రోజుల్లో అక్టోబర్‌ 16న రణబాలి ప్రేక్షకుల ముందుకు వస్తాడని తెలిపారు. 2018లో రాహుల్‌-విజయ్‌ కాంబినేషన్‌లో ‘టాక్సీవాలా’ రూపొందింది. ‘రణబాలి’లో విజయ్‌ తిరుగుబాటు యోధుడిగా కనిపించనున్నారు. 1870లో సాగే ఈ సినిమాలో హీరో పాత్ర ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని విజయ్‌ను ఎంపిక చేసుకున్నట్లు దర్శకుడు గతంలో తెలిపారు. 1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్