శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడ గిరిపురంలో అతిసారా కలకలం..

1 గంట క్రితం

atisara
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ గిరిపురంలో అతిసారతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డీఎమ్‌హెచ్‌ఓ శ్రావణ్ కుమార్ శనివారం గిరిపురంలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డీహెమ్‌హెచ్‌ఓ మాట్లాడుతూ.. గిరిపురంలో నీటి కలుషితం కారణంగా అతిసారం వచ్చినట్లు భావిస్తున్నామని.. శాంపిల్స్‌‌‌ను ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఈ పరిస్థితిని కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ వెళ్లి హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎవరికైనా వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారన్నారు. తీవ్రంగా ఉన్న బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారని వెల్లడించారు. గిరిపురంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయన్నారు. అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర ముందస్తు మందుల కి‌ట్‌లను పంపిణీ చేశామని డీఎమ్‌హెచ్‌ఓ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్