గుంటూరు : గుంటూరులో నడిరోడ్డుపై ఓ మహిళను వివస్త్ర చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 15 న రాత్రి కృష్ణబాబు కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇంటి ముందున్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకుంటున్నారు. మోటార్ తొలగించాలని స్థానిక 21వ డివిజన్ తెదేపా కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఆమెతో వాగ్వాదానికి దిగి, తీవ్రంగా కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతుండగా మూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్ మాధవి దాడి చేసి కొట్టింది. ఆమె వెంటపడి దుస్తులు చించేసి పూర్తిగా వివస్త్రను చేశారు. వదిలిపెట్టాలని బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించలేదు. నడిరోడ్డుపై మళ్లీ దౌర్జన్యానికి దిగగా, స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. బాధితురాలు ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో మూర్తి, అతని సోదరితో కలిపి 9 మందిపై కేసు నమోదు చేశామని నగరంపాలెం సిఐ సత్యనారాయణ తెలిపారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహిళల గౌరవం, భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 21వ డివిజన్ కార్యదర్శి వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు.
నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దాడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 11:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)